A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్
మహాత్మా జ్యోతి పులే ఆశయ సాధనకు కృషి చేయాలని ………
నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణంలోని హాల్ లో మహాత్మా జ్యోతి బా పులే జయంతి వేడుకలు ఆయన చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతి బాపులే గొప్ప సంఘసంస్కర్త సామాజికవేత్త రచయిత అయిన 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్ర పూణేలోని చిమాన భాయి గోవిందరావుపులే లకు జన్మించారని మాలే వర్గంలో జన్మించిన జ్యోతిబాపూలే విద్యను ప్రాథమిక స్థాయిలోనే నిలిపివేసిన తండ్రి తన వెంట పొలాలకు తీసుకెళ్లేవాడు “మాలె” వర్గంలో విద్యకు ప్రాధాన్యమిచ్చే వారు కాదు ఆయనకున్న తెలివితేటలు గమనించిన గమనించిన ఒక వ్యక్తి ఆయన తండ్రి గారిని ఒప్పించి 1947 ఆంగ్ల విద్యలో ఉన్నత విద్యను అభ్యసించాడు సావిత్రిబాయి పూలే తో వివాహమైన అనంతరం జ్యోతిబాపూలే సమాజంలోని అంట రానితనాన్ని స్త్రీల పట్ల వివక్షత గమనించి దానిని నిరోధించడానికి తన భార్య సావిత్రిబాయి పూలేను విద్యను నేర్పించాడు వారిద్దరూ కలిసి పూణేలో మొట్టమొదటిసారిగా బాలికల కోసం ప్రత్యేకమైన పాఠశాలలను ఏర్పాటు చేయడంతో శ్రీవిద్య కు శ్రీకారం చుట్టిన మహనీయుడు జ్యోతిబాపూలే అని కొనియాడారు ఆయన రచనలు “గులాంగిరి” “తృతీయ రత్న” ప్రజల్లో చైతన్యాయం నింపాయి. సమాజంలోని కుల వ్యవస్థ మూఢనమ్మకాలు స్త్రీలపై వివక్షత వ్యతిరేకంగా పోరాడి సమాజ శ్రేయస్సు “సత్యశోధక్ సమాజాన్ని,” స్థాపించి సామాజిక అభివృద్ధి కోసం కృషి చేసిన జ్యోతిబాపూలే అందరు ఆదర్శం తీసుకొని ఆయన బాటలు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి అందెల దీపక్, న్యాయవాదులు పులి జైపాల్, కేశవరావు, శివాజీ, బోస్లే, ప్రేమ్, శాంతి కుమార్, బిట్ల రవి, రేంజర్ల, సురేష్, రంజిత్, సుతారే లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.