*ఎక్సైజ్ ఆఫీస్ నిరంతరం తనిఖీలు

*నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు…

*మద్యం అక్రమ రవాణా కట్టడికి సరిహద్దులో గట్టి నిఘా..

*ఎన్నికల దృష్ట్యా చెక్ పోస్ట్ లో వద్ద ప్రత్యేక తనిఖీలు..

*ఆర్మూర్ ఎక్సైజ్ సీఐ స్టీవెన్ సన్

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది:

మద్యం షాప్ లో యజమానులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా మద్యాన్ని కల్తీ చేయకుండా నిరంతరం షాపులలో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆర్మూర్ ఎక్సైజ్ సీఐ స్టీవెన్ సన్ పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల సరిహద్దుల్లో చెక్పోస్టుల నిర్వహణ ఇతర రాష్ట్రాల మద్యం మన ప్రాంతంలోకి రానివ్వకుండా గట్టి నిగా ఏర్పాటు చేయడమే కాకుండా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా మద్యం దుకాణదారులు, బార్ నిర్వాహకులు మద్యాన్ని కల్తీ చేసినట్లు ప్రజల దృష్టికి వస్తే నేరుగా ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మద్యాన్ని కల్తీ చేయడం చట్టపరంగా నేరమని ఎవరైనా మద్యం దుకాణదారులు మద్యం కల్తీ కి పాల్పడితే చట్టపరంగా చర్యలు. ఆర్మూర్ ఎక్సైజ్ పరిధిలోని ఇతర జిల్లాల రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతరం ఎక్సైజ్ అధికారులు గట్టి నిఘాలు ..మద్యాన్ని కల్తీ చేసేందుకు ఎవరైనా మద్యం దుకాణదారులు ప్రయత్నిస్తే వారి యొక్క లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా ఎక్సైజ్ నిబంధనల ప్రకారం వారిపై కఠిన చర్య. మద్యం దుకాణ లైసెన్స్ పొందిన వారు టీఎస్ బీసీఎల్ మద్యం డిపో, మాట్లూర్ వద్ద నుంచి మాత్రమే మద్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి మద్యాన్ని తెచ్చి ఆర్మూర్ ఎక్సైజ్ పరిధిలో విక్రయిస్తున్నా విషయాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి ప్రజలు తీసుకురావాలని ఆయన ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *