మంథనిలో వైద్య విద్య రంగానికి సంపూర్ణ కృషి: మంత్రి శ్రీధర్ బాబు..

On: Friday, September 12, 2025 1:09 PM

 

పెద్దపల్లి జిల్లా:సెప్టెంబర్ 12:

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్‌ పాఠశాలల తరహాలో విద్యావకాశాలు కల్పించే లక్ష్యంతో టీచ్ ఫర్‌ చేంజ్‌ సంస్థ పని చేస్తోందని ఆ సంస్థ సీఈవో, సినీ నటి మంచు లక్ష్మి అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఎంపీపీఎస్ బాలికల ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన డిజిటల్‌ తరగతులను ప్రారంభోత్స వంలో ఆమె పాల్గొన్నారు.

డిజిటల్ తరగతులను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు,ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన విద్య అందిం చాలని స్వచ్ఛంద సంస్థ టచ్ ఫర్ చేంజ్ ద్వారా సేవలు అందిస్తున్న సినీనటి మంచు లక్ష్మి, ఇతర ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్య వైద్య రంగాలలో స్పష్టమైన మార్పు తీసు కుని రావాలని ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మంథని నియోజకవర్గ పరిధిలోని 6 ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సినీనటి మంచు లక్ష్మికి ధన్యవాదా లు తెలిపారు.

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ… ఉత్తమ, ఉన్నత విద్యకు సాంకేతిక అవగాహన దోహదపడుతుందని అన్నారు. డిజిటల్‌ తరగతుల్లో వీడియో, ఆడియోల ద్వారా పాఠ్యాంశాల బోధన సులువవుతుందని, అదే సమయంలో విద్యార్థుల్లో ఆసక్తి కూడా పెరుగుతుంద న్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని, మౌలిక వసతులతో పాటు తరగతి గదికి అవసరమైన నియామకాలు, అనువైన పరిస్థితులు కల్పిస్తున్నట్లు తెలిపారు.

14 Mar 2026

Leave a Comment