A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్లో జ్యోతి రావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదే విధంగా వినాయక నగర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే ఆదర్శమైన వ్యక్తి అని, మహిళల అభ్యున్నతి కోసం, పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడారని అన్నారు.