A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది:
ఆర్మూర్ క్షత్రియ యువజన సమాజ్ ఎన్నికలలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు నామినేషన్లను స్వీకరించినట్లు క్షత్రియ యువజన సమాజ్ ఎన్నికల అధికారి సాత్ పుతె తులసీదాస్ చెప్పారు. ఆర్మూర్ లోని క్షత్రియ సమాజ్ పాఠశాలలో ఆదివారం నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యక్ష స్థానానికి పోహార్ క్రాంతి కుమార్, శ్రీనివాస్ చౌల, సాత్ పుతె సంతోష్, చౌల సాయి శ్రీనివాస్ లు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శి పదవికి దుమాని నీరజ్, గుండు క్రాంతి కుమార్ లు నామినేషన్లు వేశారు. అధ్యక్ష పదవికి నాలుగు నామినేషన్లు, ప్రధాన కార్యదర్శి పదవికి రెండు నామినేషన్లు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది. అనంతరం నామినేషన్ల జాబితాను ప్రకటించారు. రెండు సంవత్సరాల కోసం నిర్వహిస్తున్న ఎన్నికలలో యువకులు నామినేషన్లు వేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అయితే కొందరి పేర్లు ఓటర్ జాబితాలో లేకపోవడంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో క్షత్రియ సమాజ్ కార్యదర్శి బారడ్ గంగా మోహన్, యువజన సమాజ్ మాజీ అధ్యక్ష కార్యదర్శులు జీవి ప్రశాంత్, విశ్వనాథ్, శ్రీను, రాజేష్ లు యువకులను నచ్చజెప్పి ప్రశాంతంగా నామినేషన్ల స్వీకరణ జరిగే విధంగా చూశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎన్నికల అధికారి డమాంకర్ రవీందర్, ఎన్నికల పరిశీలకులు కర్తన్ హరి నారాయణ, సహాయ ఎన్నికల అధికారులు దోండి రవీందర్, ఎన్నికల సలహాదారులు కర్తన్ మధుసూదన్, సాత్ పుతె శ్రీనివాస్ పాల్గొన్నారు.