A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:
మన్యవార్ కాన్షిరాంతొ కరచాలనం చేసిన సేవకుడు అస్తమయం 1998లో ముంబైలోని తెలుగు ఎస్సీ ఎస్టీ ప్రజలు తొలి సారిగా మాన్యవర్ కాన్షిరాం ను డిల్లీ నుంచి ముంబైకి పిల్చి బహిరంగ సభను ఎర్పాటు చేసిన ఘనత ఉంది. ఇది ముంబై తెలుగువారు చేసిన ఐతిహాసిక గొప్ప ఘటన. ఈ కార్యక్రమంలో క్రియాశీల పాత్ర వహించిన ఘనత శాంతరావు బాజన్న కూన ది. వీరు కాన్షిరాం తో కరచాలనం చేసిన ఘనత దక్కింది. వీరు జిల్లా నిజమాబాద్ మోర్తాడ్ మండలం పాలెం గ్రామ వాస్తవ్యులు. వీరి తండ్రి ముంబైలో 1948లో బాబాసాహెబ్ అంబేడ్కర్ మీటింగులు సభలకు హాజరైన వ్యక్తి. చివరికి అంబేడ్కర్ అంతిమయాత్రలో అంతక్రియల్లో పాల్గొన్న విషయం అంబేడ్కరైట్లకు విదితమే. అయితే శాంతరావు ఆదివారం సాయంత్రం ముంబై నాయార్ హాస్పిటల్ నందు అనారోగ్యంతో మృతి చెందారు. వీరికి ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు. వీరు బి.ఇ.ఎస్.టి లో విధి నిర్వహణలో ఉండిరి. వీరి అంతక్రియలు సోమవారం జరగనున్నాయని అతని తమ్ముడు మూల్ నివాసి మాలజీ బహుజన లోకానికి తెలియజేశారు. శాంతరావు ముంబైలోని కామటిపురా, కింగ్స్ సర్కల్ లోగల ఆతి పురాతన ఆంధ్ర హరిజన సేవా సంఘం, అంటాప్ హిల్ లోని డాక్టర్ అంబేడ్కర్ తెలుగు సంఘాలకు అడ్వైజర్ గా కృషి చేశారు. చివరి దశలో పరెల్ అర్.ఎం.ఎం టీ.సి మెథడిస్ట్ సెంట్రల్ చర్చ్ లో పెద్ద మన్షిగా, ఆత్మీయంగా వ్యవహరించిన ఘనత శాంతరావు ది.