A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది:
*ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు డిమాండ్
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఆర్డీవో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఏం నరేందర్, ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు అనిల్ కుమార్ లు మాట్లాడుతూ
తెలంగాణ వచ్చిన నుండి ఇప్పటివరకు కూడా సరైన విధంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాక విద్యార్థులకు అనేక అవస్థలకు గురవుతున్నారని పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువు కోవడానికి భారంగా అవుతుందని, ఆ కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందని గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఎన్నో అనేక ఉద్యమాలు పిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యవహరించి విద్యార్థులను వారి భవిష్యత్తును పణంగా పెట్టిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అని చెప్పారు. అదే తోవలో నడుస్తున్న కొత్త సార్ రేవంత్ రెడ్డి కూడా మీ యొక్క వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఉద్యమాల నిర్వహిస్తుందని పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్ ఫెల్లోషిప్ లను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అధిక నిధులు విద్యారంగానికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మీకు కూడా కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని ప్రజలు లోక్సభ ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్తారు. అని ఎవరు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి నిఖిల్, నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.