A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది:
*భద్రత మాది బాధ్యత మాది అనే పోలీస్ శాఖకు ఏమైంది!
*జర్నలిస్టులను బూతు మాటలు తిట్టిన
*జగిత్యాల ఎస్ఐ జక్క రవీందర్ పై కేసు నమోదు అయిందా లేదా?
భద్రత మాది బాధ్యత మాది అనే పోలీస్ శాఖకు ఏమైంది. ఆర్మూర్ పోలీస్ శాఖ సమాచారం అందించడంలో వైఫల్యం కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని ముగ్గురు జర్నలిస్టులను బూతు మాటలు తిట్టిన జగిత్యాల ఎస్ఐ జక్క రవీందర్ పై కేసు నమోదు అయినట్టు బయట పుకార్లు వినిపిస్తున్నాయి. తన పరిధిలోకి రాని ఆర్మూర్ జర్నలిస్టులను ఇష్టారీతిన బూతు మాటలు తిట్టిన కేసును ఆర్మూర్ పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితత్వమైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సి ఉండగా పోలీసులంతా ఒక్కటే అనే నినాదం కాపాడే యత్నం పరాకాష్టగా నిలుస్తుంది. ఏ శాఖకు సంబంధించిన వారు ఆ శాఖలోని అధికారులు కాపాడితే మరి న్యాయం ఎక్కడ జరుగుతుందని ప్రజలు అవాక్కవుతున్నారు. ప్రజలకు సమాచారం అందించడంలోనే ఇంతటి జాప్యం జరిగితే పోలీసు మెట్లు ఎక్కుతున్న బాధితులకు సరైన న్యాయం జరుగుతుందా అనే ప్రశ్న మొదలవుతుంది.