A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది:
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గురువారం రోడ్డుపై కూరగాయ వ్యాపారులకు ఆరోగ్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మామిడిపెళ్లి బస్తి దవాఖాన వైద్యాధికారిణి ప్రీతి పావని మాట్లాడుతూ వడదెబ్బ అనేది తక్షణ వైద్య సహాయం అందవలసిన పరిస్థితి అని శరీరంలోని ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటిగ్రేడ్ అంతకంటే అధికంగా అయినప్పుడు వడదెబ్బ కు గురైనట్లుగా నిర్ధారించుకోవాలని సూచించారు. మధ్యాహ్నం పూట అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని బయటకు వెళ్లవలసిన అవసరం వచ్చినప్పుడు సన్నని కాటన్ వస్త్రాలు ధరించాలని నెత్తికి వేడి తగలకుండా రక్షణగా కాటన్ టవల కానీ టోపీ కానీ ధరించాలని తెలియజేశారు. శరీరంలో నుండి చెమట రూపంలో నీరు వెళ్లిపోవడం వల్ల శక్తిహీనంగా అవ్వడం జరుగుతుంది దీనికోసం ఓ ఆర్ ఎస్ పాకెట్లో త్రాగడం వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు అన్నారు వడదెబ్బ యొక్క లక్షణాలు అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చికాకు, స్పృహ కోల్పోవడం, వాంతులు, తలనొప్పి, లాంటివి ఉన్నచో వడదెబ్బ సోకిందనుకోవాలి. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్ స్టాఫ్ నర్స్ స్రవంతి ఆశా కార్యకర్తలు మమత, సుభద్ర, రమ తదితరులు పాల్గొన్నారు.