Tuesday, November 26, 2024

భగత్ సింగ్ స్పూర్తితో అసమానతలు లేని సమాజం కోసం ఉద్యమిచలి – డా.పోచయ్య టీ.పీ.టీ.ఎఫ్

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది:

ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గాల ఇంటిగ్రాటెడ్ హాస్టల్ లో పీ.డి.ఎస్.యు ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో షహీద్ దివస్ సందర్బంగా అమరవీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93వ వర్ధంతి సందర్బంగా పూలమాలలు వేసి, సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఆర్మూర్ డివిజన్ ఆధ్యక్షులు ప్రిన్స్ మాట్లాడుతూ ఈ సదస్సుకు ముఖ్యం వక్తగా డా.పోచయ్య టీ.పీ.టీ.ఎఫ్ జిల్లా నాయకులు వచ్చారు అన్ని అన్నారు. ఈ సదస్సుకు ఉద్దెశించి డా. పోచయ్య మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వాడికి ఎదురు నిలిచి కొట్లాడి ,తమ ప్రాణాలనే అర్పించిన గొప్ప వీర కిశోరాలు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ఇచ్చిన పోరాటస్ఫూర్తితో నేటి సమాజంలోని అసమానతలు, అణచివేతకి వ్యతిరేకంగా పోరాడాలని మరియు విద్యార్థులు తమ జీవితలలో వాళ్ళ స్పూర్తితో ఉన్నంత స్తాయి చేరాలని పిలుపునిచ్చారు. మరియు ప్రిన్స్ మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భారతదేశ విముక్తి కోసం, స్వేచ్చా స్వాతంత్ర్యం కోసం తమ విలువైన ప్రాణాలను భారత జాతికి అంకితం ఇచ్చారని, ఉరితాడును ముద్దాడి అమరులయ్యారని, ఇరవై మూడేళ్ళ వయసులో ఈ దేశాన్ని పరాయి పాలన నుండి విముక్తి చేయాలని, బ్రిటిష్ కర్కశ పాలనపై తమ తిరుగుబాటు జండను ఎత్తి, ఎన్ని చిత్ర హింసలు పెట్టినా వెనక్కి తగ్గకుండా తుడికంటా పోరాడిన వీర యోధులు అని అన్నారు.తమ నిరసన గళాన్ని ప్రభుత్వానికి చెప్పడం కోసం పార్లమెంటు భవనంలో బాంబులు విసిరి ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదిస్తూ, తమ భావాల్ని కరపత్రాల్లో ముద్రించి బ్రిటిష్ వాళ్లపైకి విసిరి, తాము దొరికిపోయినా తాము ఇచ్చిన చైతన్యంతో దేశంలోని అశేష ప్రజానీకం స్వాతంత్ర్య ఉద్యమం లోకి వస్తుందని, తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లిన వారు అన్ని అన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల స్పూర్తితో విద్యార్థులు ఎన్ ఈ పి 2020 వెతిరేకంగా మరియు విద్యరంగా సమస్యలపై పోరాటాలు ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్వేచ్చా, స్వాతంత్ర్యం కోసం దోపిడీ, పీడన లేని నూతన వ్యవస్థ కోసం తిరుగుబాటుకి సిద్దం కావాలని ప్రిన్స్ కోరారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ మంచేందర్ సార్, మరియు పీ.డి ఎస్.యు నాయకులు నిశాంత్, రాహుల్, మనోజ్, హిమాన్షు, రోహిత్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here