A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:
ఆర్మూర్, మామిడిపల్లి, పెర్కిట్ మున్సిపల్ పరిధిలో సమస్యలు పట్టించుకోని మున్సిపల్ కమిషనర్ రాజు ప్రతి సంవత్సరం కొత్తగా కమిషనర్ రావడం, వారిని ప్రభుత్వ నియమించినట్లే కానీ ప్రజలకు సేవ చేయడంలో పూర్తిగా విఫలమైన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది.
* 1) పింఛన్లు రాక ఇబ్బంది పడుతున్న మహిళలు.
* 2) కొత్త పింఛన్లు ఐదు సంవత్సరాలు అయిన మంజూరు కానీ పరిస్థితి.
*3) ఇదిగో రేపు వస్తా ఇదిగో ఎల్లుండి వస్తాయి అని చెప్పడమే అధికారుల నిర్లక్ష్యం.
*4) గల్లీలో డ్రైనేజ్ సమస్య సిసి రోడ్ల సమస్య వీధి దపాల సమస్య పట్టించుకోని కమిషనర్, జిల్లా కలెక్టర్ మాత్రం ఆదేశాలు జారీ చేయడమే. అంతే కానీ మున్సిపల్ పరిధిలో అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో కమిషనర్ కి తెలియని పరిస్థితి. ఎవరో చెప్తే గాని తెలుసుకోలేని స్థితిలో ఆర్మూర్ కమిషనర్ పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని, మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ పరిధిలో గ్రామస్తులు ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు.