హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం…..

On: Tuesday, September 2, 2025 3:38 PM

 

జక్రాన్ పల్లి మండలంలోని హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో భాగంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అదే విధంగా భక్తి శ్రద్దలతో పూజ కార్యక్రమం నిర్వహించిన అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధ ప్రసాధాలు స్వీకరించడం జరిగిందని అన్నారు.

అలాగే యూత్ సభ్యుల ఆహ్వానాన్ని మన్నించిన జక్రాన్ పల్లి SI అయినటువంటి మాలిక్ గారు వినాయకున్ని దర్శించుకోవడం జరిగిందని, యూత్ సభ్యులు అందరూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ అధ్యక్షుడు మొచారి రాజేందర్,రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సోప్పరి వినోద్, పవన్ కళ్యాణ్,నవీన్,దుబ్బాక సాగర్,పునీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

14 Feb 2026

Leave a Comment