A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది:
ఆర్మూర్ లోక కళ్యాణం కోసం సిలువలో తన ప్రాణాన్ని అర్పించి, తిరిగి మూడవరోజు మృత్యువును ఓడించి సజీవుడైన క్రీస్తు సజీవ తత్వాన్ని ఆరాధిస్తూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి అగాపే చర్చ్ లో ఘనంగా ఈస్టర్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, అనగానే వర్షిప్ సెంటర్ వ్యవస్థాపకుడు రమేష్ జాన్ మాట్లాడుతూ… క్రీస్తు సజీవతత్వం క్రైస్తవ విశ్వాసానికి పునాది లాంటిదని, ప్రపంచ చరిత్రలో ఎంతోమంది మహామహులు జన్మించినప్పటికీ క్రీస్తు ఒక్కడే చావును గెలిచి లేచిన మృత్యుంజయుడని పొగిడారు. క్రీస్తు ప్రేమ తత్వాన్ని అలవర్చుకొని జీవన విధానాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అగాపే వర్షిప్ సెంటర్ లో ఆలపించిన గీతాలు పలువురిని అలరించాయి. కార్యక్రమంలో ఆయా గ్రామాల క్రైస్తవులు, నాయకులు పాల్గొన్నారు.