*ఓటు హక్కు ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి…భీంగల్ లో ఘనంగా 5K రన్*
సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం
*భీంగల్* భీంగల్ పట్టనకేంద్రం లో గురువారం రోజు ఉదయం 8 గంటలకి 019-బాల్కొండ నియోజకవర్గ హెడ్ క్వర్టార్ అయిన భీంగల్ పట్టణం వేల్పూర్ రోడ్డు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అంబెడ్కర్ చౌరస్తా వరకు ప్రధాన రహదారి గుండా భీంగల్ తహశీల్దార్ శ్రీలత & కమ్మర్పల్లి తహశీల్దార్ ఆంజనేయులు గారి అధ్యక్షతన స్థానిక మున్సిపల్ కమిషనర్,మెప్మా సిబ్బంది,కృషి హై స్కూల్,శ్రీ నారాయణ హై స్కూల్ విద్యార్థులు,తహసీల్దార్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది,బూత్ లెవల్ ఆఫీసర్లు ,రాజకీయ నాయకులతో కలిసి 5K రన్ లో భాగంగా రోడ్డు వెంబడి నినాదాలు ఇస్తూ, భీంగల్ పట్టణ ప్రజలకి ఓటు యొక్క శక్తి పట్ల అవగాహన కల్పించినరు అలాగే రానున్న ఎన్నికల్లో ముక్యంగా యువత యొక్క వోటింగ్ పర్సెంటేజ్ పెంచాలి ప్రతి ఒక్క యువతి యువకులు అందరూ కూడా ఓటు హక్కు ని వినియోగించుకిని పటిష్టమైన సమాజాన్ని రూపుదిద్దికోవడానికి సకరించాలని వారు తెలిపినరు..ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మధు,గీర్దావర్ ధనుంజయ్,ఎలక్షన్ DT అశ్విన్ బాబు,కృషి హై స్కూల్ ,శ్రీ నారాయణ హై స్కూల్ విద్యార్థులు,019 – బాల్కొండ నియోజకవర్గ అన్ని మండలాల అధికారులు మరియు బూత్ లెవల్ ఆఫీసర్లు పాల్గొన్నారు వందల సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు…