A9 న్యూస్ ప్రతినిధి:
సిరికోండ మండలం గడ్కోల్ గ్రామంలో షహిద్ భగత్ సింగ్ 93వ వర్థంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ సిరికొండ మండల సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ లు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను బలిదానం చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు యువతకు ఆదర్శప్రాయులని తెలిపారు. నేటి పాలకవర్గ ప్రభుత్వాలు స్రామ్రాజ్యవాదులకు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు పోరాడాలని వారు పిలుపుని ఇచ్చారు. నరేంద్ర మోడి ప్రభుత్వం పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం తీసుకువస్తామని రైతులకు హమీ ఇచ్చి మోసం చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిన హామీలను అమలుపరచమని అడిగేందుకు వెళ్లినటువంటి రైతులని ఢిల్లీ చేరుకోనివ్వకుండా రోడ్లపై ముళ్లకంచెలు ఏర్పాటుచేసి వారి పైన భాష్ప వాయువులు ప్రయోగించిందని వారు అన్నారు అంతేకాకుండా ఏకంగా హర్యానా ప్రభుత్వం హర్యానా రైతుల పైన కాల్పులు జరిపి యువరైతు శరణ్ సింగ్ ని హత్య చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ శక్తులకు అప్పనంగా అప్పచెప్పాలని చుస్తుందన్నారు. పౌరసత్వ సవరణ చట్టం సి ఏ ఏ దేశ ప్రజలు తిరస్కరించాలని వారు కోరారు. దేశ ప్రజల మధ్య విద్వేషం నింపుతున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఈ సందర్భంగా వారు రైతులకు యువకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిమ్మల భూమేష్, గులాం హుస్సేన్, కృష్ణ, చిన్న గంగాధర్ వి పద్మ, వి వెంకటి, పూజిత రవి నర్సాగౌడ్, పి వై ఎల్ మండల అధ్యక్షుడు మల్కి సంజీవ్, జావీద్, తదితరులు పాల్గొన్నారు.