A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నరేంద్ర మోడీ ప్రభుత్వ రైతు, కార్మిక, విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలను మతోన్మాదాన్ని, స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల అమరత్వ స్ఫూర్తితో ఏదిరించాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి, పి వై ఎల్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు దాసు విద్యార్థి యువతకు పిలుపునిచ్చారు.
ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి భగత్ సింగ్ విగ్రహం వద్ద 93వ స్మార్త సభలో ఆయన ప్రసంగిస్తూ సామ్రాజ్యవాద వ్యతిరేకత నిజమైన దేశభక్తి అని దాసు అన్నారు.పిడిఎస్యు, పి వై ఎల్ ఆధ్వర్యంలో జరిగిన స్మారక సభలో ఆయన మాట్లాడుతూ
నరేంద్ర మోడీ పాలనలో 1,00,474 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడలుగా కుదించి, కార్మికులకు మరణశాసం లిఖించడమే దేశభక్తి ఎలా అవుతుందని మోడీ సర్కార్ను దాసు నిలదీశారు. అన్నదాత రైతన్న పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా, వ్యవసాయ రంగాన్ని బలిపీఠాన్ని ఎక్కించడం ఎలాంటి దేశభక్తిని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, మోడీ ప్రతిఏటా రెండు కోట్ల కొలువులు ఇస్తానని మాట తప్పడం దేశసేవ ఎలా అవుతుందని ఆయన అన్నారు. అందుకే బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన జాతీయ విప్లవీరుల అమరత్వ స్ఫూర్తితో మతోన్మాదాన్ని, కార్పోరేటికరణనను వెనక్కి కొట్టి, దేశానికి నిజమైన స్వాతంత్ర్యం కోసం ఉద్యమిద్దా మని దాసు పిలుపునిచ్చారు.
పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు బి. ప్రిన్స్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తూ, ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలుకు కుట్ర చేస్తుందని, ఆయన తెలిపారు.
వ్యక్తిగతమైన మతాన్ని, రాజకీయాలకు చొప్పించి లబ్ధి పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన అన్నారు. విద్యా కషాయికరణకు కుట్రలు చేస్తుందని, దేశభక్తిని దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. విద్యా రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 30 శాతం నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంక్విలాబ్ నినాదంతో దేశం కోసం ఉద్యమించడమే భగత్ సింగ్ కు నిజమైన నివాళి అని అన్నారు.
ఈ స్మారక సభలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు బి సూర్య శివాజీ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి భూమన్న, పర్సపద్మారావు, అర్గుల్ మాజీ సర్పంచ్ జగదీష్, పి.డి.ఎస్.యూ ఆర్మూరు మండల నాయకులు మనోజ్, రాహుల్, మనోజ్. పి వై ఎల్ ఆర్మూరు మండల అధ్యక్షులు ఎస్ వెంకటేష్, లోకేష్, మమ్మద్, బి వో సి నాయకులు రాజు, కాజా తదితరులు పాల్గొన్నారు.