A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణం పెర్కిట్ లో గల ఎమ్మార్ గార్డెన్ వెనుక నిర్మిస్తున్న భవనాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. మున్సిపల్ నుంచి తీసుకున్న అనుమతి ప్రకారం భవనాన్ని నిర్మించలేదని ఆయన అన్నారు. పెర్కిట్ లోని ఎమ్మార్ గార్డెన్ వెనుక చందూరి పద్మావతి వాళ్ళు 3 అంతస్తుల భవన నిర్మాణానికి మున్సిపల్ నుంచి అనుమతి పొందారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఏలాంటి కట్టడాలు చేయకుండా పార్కింగ్ కోసం వదలవలిసి ఉంటుంది. మున్సిపల్ ద్వారా తీసుకున్న అనుమతి ప్రకారం కాకుండా దానికి విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో కమిషనర్ ఎమ్మార్ గార్డెన్ వెనుక నిర్మిస్తున్న కట్టడాన్ని టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనుమతి ప్రకారం మూడంతస్తుల భవనాన్ని నిర్మించాల్సి ఉండగా నాల్గవ అంతస్తు లో అక్రమంగా పెంట హౌస్ ను నిర్మించారని మున్సిపల్ అధికారులు గుర్తించారు. మున్సిపల్ అనుమతి ప్రకారం సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేశారన్నారు. నిర్మాణంలో డివేషన్స్ ఉన్నందున సెట్ బ్యాక్ కావాలని కమిషనర్ చెప్పారు. రోడ్డు వైపు ఎలివేషన్ ముందుకు వచ్చిందని గుర్తించారు. రోడ్డుకు ఇరువైపులా రెండు మీటర్లు ముందుకు వచ్చి నిర్మాణం చేశారని చెప్పారు. వెనుక భాగంలో 1.5 మీటర్లు సెట్ బ్యాక్ కావాలని చెప్పారు. మున్సిపల్ అనుమతి ప్రకారం భవనాన్ని నిర్మించినందున రెండు రోజులలో టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి కొలతలు చేసి ఎక్కడి వరకు సెట్ బ్యాక్ కావాలో మార్కింగ్ ఇస్తారన్నారు. భవన నిర్మాణంలో డివేషన్స్ ఉన్నందున మున్సిపల్ ద్వారా నోటీసులు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు.