A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్ గుర్తు తెలియని దుండగులు వివాహిత మహిళ లాస్య (26) గొంతు కోసి హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన లాస్య ను ఆర్మూర్ పట్టణానికి చెందిన రాకేష్ తో 4 సంవత్సరాల క్రితం వివాహమైంది. మృతురాలి భర్త బ్రతుకుతెరువు కోసం గల్ఫ్ కి వెళ్లారని తెలిపారు. వీరికి ఆరు నెలల పాప ఉంది. శనివారం రోజు మధ్యాహ్నం గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు కోసి హత్య చెసి పరారయ్యాడు. మహిళ మెడలోని బంగారు ఆభరణాలను కనిపించడం లేదని స్థానికులు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ .హెచ్. ఓ రవికుమార్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.