A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
*జగిత్యాలలో ఎస్సైగా విధులు..
ఆర్మూర్ లో జర్నలిస్టులుగా పనిచేస్తున్న గోలి పురుషోత్తం, పార్ధేం సంజీవ్, మేకల దినేష్ లను జగిత్యాల లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జక్కం రవీందర్ బూతు మాటలతో తిట్టి బెదిరించినందున కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు సీఐ రవికుమార్ కు ఫిర్యాదు చేశారు. శనివారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు జర్నలిస్టులు తరలివచ్చారు.
ఆర్మూర్ పట్టణం పెర్కిట్ చౌరస్తా వద్ద నున్న రాజేందర్ కిరాణా షాపు యజమానికి దినపత్రికలలో యాడ్ అడిగినందున రాజేందర్ కుమారుడు జగిత్యాల లో పనిచేస్తున్న ఎస్సై జక్కా రవీందర్ కు సమాచారం ఇచ్చాడు. దీంతో రెచ్చిపోయిన ఎస్ఐ రవీందర్ గత రెండు రోజుల నుంచి పురుషోత్తం, దినేష్ లకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి బెదిరిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పురుషోత్తం కు సంబంధించిన కారు యజమానిని సైతం ఫోన్ చేసి బెదిరించాడని పేర్కొన్నారు. గత రెండు రోజులుగా సెల్ఫోన్ ద్వారా ఫోన్ చేసి బూతు మాటలు తిట్టి బెదిరిస్తున్న ఎస్సై రవీందర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ముగ్గురు జర్నలిస్టులకే కాకుండా ఆర్మూర్ లోని జర్నలిస్టులందరిని దూషించిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఎస్సై ఫోన్ లో బెదిరించిన ఆధారాలను సైతం పోలీస్ స్టేషన్ లో పోలీసులకు అందజేశారు.