A9 న్యూస్, ప్రతినిధి
*జిత్తు భాయ్*ఇందల్వాయి, ఇందల్వాయి జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ మంజూరు చేయాలని ఇందల్వాయి ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్ నిజామాబాద్ జిల్లా డిఈఓ ను కలసి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన వినతి పత్రాన్ని తీసుకొని సానుకూలంగా స్పందిస్తూ జూన్ లో ఓపెన్ పరీక్షలు నిర్వహించే సమయంలో ఆలోచించి వివిధ పరీక్షలు దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయం తీసుకుంటామని సానుకూలంగా స్పందించడం జరిగింది 100% ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ మంజూరు అవుతుందని పూర్తి విశ్వాసం ఉంది అని ఎంపీటీసీ సుధాకర్ వ్యక్తం చేశారు ఇప్పుడు జరుగుతున్న టెన్త్ పరీక్షలకు కూడా విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు మరియు యువకులు నాకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని స్కూల్ హై స్కూల్ వద్దకు పరీక్షల నిర్వహించే సమయంలో ఎవరు కూడా వెళ్ళవద్దని ఈ పరీక్షలు సక్రమంగా జరిగితే రాబోవు ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలు కూడా మన ఇంధల్ వాయి జెడ్పి హెచ్ఎస్ హైస్కూల్ కి తప్పకుండా వస్తాయని ఆయన కోరారు.