A9 న్యూస్
ఇందల్ వాయి 20వ తారీకు జరగాల్సిన బాలయ్య వివాహాన్ని అడ్డుకున్న అధికారు 15 సంవత్సరాల మైనర్ అమ్మాయికి సిరికొండ మండలాని కి చెందిన ఓ అబ్బాయి తో బాల్యవివాహం చేయడానికి ఇందల్వాయి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక 18 తేదీన పదవతరగతి పరీక్షలు రాస్తుండటం విశేషం ఈ మైనర్ బాలికకు పెళ్లి సంబంధాలు కుదిరించి ఈ నెల 20న పెళ్లి ఏర్పాట్లు కూడా పెద్దలు సిద్ధం చేశారు అమ్మాయి ప్రస్తుతం ఇందల్వాయి మండల కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది ,ssc పరీక్షలు కూడా ఈరోజు 18 తారీకున రాసింది ఇట్టి విషయాన్ని తెలుసుకున్న అధికారులు అమ్మాయి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి వారికి బాల్యవివాహం చేస్తే జరిగే అనర్థాలు గురించి కుటుంబ సభ్యులకు తెలపడం జరిగింది బాల్యవివాహం జరిగితే చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇట్టి కౌన్సెలింగ్ లో డిచిపల్లి సీడీపీఓ స్వర్ణలత గారు, ఐసీపీస్ కౌన్సిలర్ జమురు , icds supervisor శోభ , ఇందల్ వాయీ ఎస్ఐ మనోజ్ కుమార్ ఇందల్వాయి రెవిన్యూ ఇన్సెపెక్టర్ మోహన్ , గ్రామ పెద్దలు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు, ఇలాంటి బాల్య వివాహం ఎక్కడైనా జరుగుతే అధికారులకు తక్షణమే సమాచారాన్ని అధికారులకి ఇవ్వాలని వారు కోరారు.