A9 న్యూస్: ఇందల్ వాయీ జిల్లాలోని అన్ని గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతు వారి పంట నష్టం వివరాలను అందించాలని అధికారులను కోరిన రూరల్ ఎమ్మెల్యే
ఈరోజు తేది 16-03-2024 శనివారం సాయంత్రం వడగళ్ళ వాన కురియటం వలన నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది అనే వార్తలు అందిన నేపథ్యంలో, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి గారు నియోజకవర్గంలోని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు, రేపు వారి పరిధిలోని గ్రామాల్లోని రైతులతో మాట్లాడి రైతు వారి నష్టం అంచనాలను జిల్లా కలెక్టర్ గారికి సమర్పించాలని , ఏ ఒక్క రైతును విస్మరించరాదని, అధికారులను కోరారు. అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయని విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ప్రతీ రైతును ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.