*సదాశివ్ *బచ్చగొని A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం*
నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లో గల శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్ లో 10 వ తరగతి 28వ బ్యాచ్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ . ఇట్టి కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా ఆసనాలు అందరిని అబ్బురపరిచి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకోన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షుడు డాక్టర్ జి బసంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువు, సంస్కారంతోపాటు సామాజిక సేవ కూడా అలవాటు చేసుకోవాలని భవిష్యత్తులో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదుకోవాలని దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారు కావాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి. బసంత్ రెడ్డి కమిటీ సభ్యులు కే. గంగారం గారు, జి. నర్సయ్యగారు, జే సుధాకర్ రావు జి. అరవింద్ కుమార్ పాఠశాల విద్యా విషయక సలహాదారులు యేన్ను శ్రీధర్, నీల ప్రవీణ్, నీల రవి ,డాక్టర్ రామగిరి భాను, బాల్కొండ లోని మహతి ఆశ్రమం వ్యవస్థాపకురాలు శ్రీమతి నిర్మల మేడం, పాఠశాల ప్రధానాచార్యులు కే. రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి. నర్సారెడ్డి ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.