బాల్కొండ A9 న్యూస్, ప్రతినిధి ఫిబ్రవరి 28:
విద్యార్థి దశలోనే క్రమ శిక్షణ తోనే విద్య అవలంబిస్తుందని యన్.సి.సి (ఆర్మీ) ప్రథమ అధికారి నర్సింగ్ రావు అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో భుదవారం మదర్ థెరిస్సా ఉన్నత పాటశాలలో విద్యార్థుల వార్షిక ఉత్సవాలతో పాటు, 10 వ తరగతి విద్యార్థుల వీడుకోలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నర్సింగ్ రావు విద్యార్థులను ఉద్దేశిస్తూ జీవితంలో ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం అంటూ ఉండాలని, ఒక లక్ష్యంతో విద్యార్థి ఉన్నపుడే జీవితంలో అను కున్న లక్ష్యంన్ని చేరుకునేందుకు అవకాశం ఉంటుందని, లక్ష్యం లేకుంటే ఆ విద్యార్థి జీవితాన్నే చేతులారా నాశనం చేసుకుంటారని వారి జీవితంలో జీవితాంతం బాధ పడుతూ ఉంటారని ఆయన విద్యార్థులను ఉద్దేశిస్తూ అన్నారు.
విద్యార్థుల తల్లి దండ్రులు పిల్లలు పాఠశాలలో ఏవిధంగా చదువుతున్నారో చూసు కొనే బాధ్యత ప్రతి పిల్లల తల్లి దండ్రుల దేనని అలాగే ప్రతి తల్లి దండ్రులు తమ పిల్లలను మొబైల్ ఫోన్ కి దూరంగా ఉంచాలని అలాగే ఒక విధ్యా సంస్థని నడపాలంటే ఎంత కష్టమో ఒక్క సారి ఆలోచన చెస్తూ పాటశాల యాజమాన్యానికి సహకరించాలని నర్సింగ్ రావు విద్యార్థుల తల్లి దండ్రులకు విజ్ఞప్తి చేశారు.
ఈ ఉత్సవాల సందర్భంగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు జీవితంలో డాక్టర్, ఇంజనీర్, టీచర్ లుగా పోలీస్ అధికారుల అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జి.నర్సింహ రెడ్డీ, మాట్లాడుతూ బాల్కొండలో 10 జూన్ 1991 లో కేవలం 02 విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల 10 జున్ 2003 లో 30 మందితో మొదలుకొని నేడు 500 మందితో పురోగమనంలో ఉందనీ వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర పాఠశాల కరెస్పెండేంట్ రామ లక్ష్మి, ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి, శ్రీ వేంకటేశ్వర, మదర్ థెరీసా ఉపాధ్యాయులు తదితరులు పాల్గునారు.