నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్ గల్ పట్టణం లో గల సరస్వతి విద్యా మందిర్ పాఠశాల లో భారతీయ భౌతిక శాస్త్రవేత్త నోబెల్ గ్రహీత సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశాల విద్యార్థులు 75 సైన్స్ మోడల్స్ ను తయారు చేయడం జరిగింది. ఈరోజు ఈ మోడల్స్ ను పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి. బసంత్ రెడ్డి పరిశీలించగా, విద్యార్థులు మోడల్స్ గురించి అధ్యక్షుల వారికి వివరించినారు. ఈ సందర్భంగా విద్యార్థులను మరియు సైన్స్ గైడ్ టీచర్లను అధ్యక్షులవారు అభినందించినారు. తర్వాత పాఠశాలలోని హై స్కూల్ విద్యార్థులు కూడా తరగతి వారిగా వెళ్లి ఈ మోడల్స్ ను చూసినారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు కే. రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి. నర్సారెడ్డి, ఫ్లోర్ ఇంచార్జ్ ఆర్. రవికుమార్, అకౌంటెంట్ పి. హరికృష్ణ, సైన్స్ గైడ్ టీచర్లు బి. స్వర్ణ, ఎమ్. నవనీత, జి. హారిక, బి. సాయి పల్లవి, డి. శ్రీనివాస్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.