ఆర్మూర్ A9 న్యూస్, ప్రతినిధి:
ఆర్మూర్ – తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ప్రజాపక్షం ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ సంపాదకులు కె శ్రీనివాస్ రెడ్డి ని. రాష్ట్ర ప్రభుత్వం నియమించినందుకు. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ టియుడబ్ల్యూ జే నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు. నావనాథపురం ప్రెస్ క్లబ్ మాజీ ఉపాధ్యక్షుడు. ఆర్మూర్ ప్రజాపక్షం పాత్రికేయుడు, సంజీవ్ పార్దేమ్, హర్షం వ్యక్తం చేస్తూ, వారికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పాత్రికేయ వృత్తిలో ప్రవేశించగానే దేశంలో జర్నలిస్టులకు ఉన్న అతిపెద్ద సంఘం ఆంధ్రప్రదేశ్ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘానికి కే శ్రీనివాసరెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని ఆయన సేవలను కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.