ఆర్మూర్ A9 న్యూస్, ప్రతినిధి:
ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు ఆదివారం రోజు హైదరాబాద్ లోని కూకట్పల్లి లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అబాకస్ పరీక్షలో శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు బి. మనస్వి 5వ, తరగతి, ఎన్.అక్షిత 5వ, తరగతి, డి.రిషిక 4వ, తరగతి, బి.భూమేష్ చంద్ర 3వ, తరగతి పాల్గొన్నారు. ఈ విద్యార్థులలో మూడవ తరగతికి చెందిన బి.భూమేష్ చంద్ర స్టార్ జూనియర్ లెవెల్-2 లో రాష్రం లోనే మొదటి స్థానంలో నిలిచి, వచ్చే మార్చి నెలలో హైద్రాబాద్ లో జరిగే జాతీయ స్థాయి పోటీ పరీక్షకు ఎంపిక కావడం జరిగింది.
ఇందులో భాగంగా శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్, ప్రిన్సిపల్, ఇంఛార్జీలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, భూమేష్ చంద్రను అభినందించారు.
శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండంట్, పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ఇటువంటి పోటీ పరీక్షలు పిల్లలలో పోటీతత్వమే కాకుండా, మానసిక శక్తిని పెంపొందిస్తాయని, గత 19సం. లుగా అబాకస్ లో విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత శ్రీ భాషిత పాఠశాల కు దక్కాయని తెలిపారు. ఇట్టి వాటన్నింటికీ సహకారాలు అందిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.