Tuesday, November 26, 2024

ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూ డి ఓ, సమావేశాలలో పాల్గొన్న కోటపాటి నరసింహనాయుడు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

            ఆర్మూర్ A9 న్యూస్, ప్రతినిధి:

యునైటెడ్ అరబ్ ఎమి గ్రేడ్స్ లోకి అబుదాబి లో  సోమవారం ప్రారంభమైన ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో 13వ ప్రపంచ మంత్రుల స్థాయి సమావేశం ప్రారంభమైనది అనేక దేశాల వాణిజ్యమంత్రులు ఎన్జీవో, సంస్థల ప్రతినిధులు హాజరైనారు భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామిగా ఉన్నది కాబట్టి ఇక్కడ తీసుకునే నిర్ణయాలు భారతదేశంలోని అనేక వర్గాల పై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా డబ్ల్యూ టి ఓ, చట్టాలు ఉన్నాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కులు హరించబడుతున్నాయి ముఖ్యంగా వెనుకబడిన దేశాల ఉత్పత్తులు అనుమతించడం కోసం అభివృద్ధి చెందిన దేశాలు అనేక ఆంక్షలు పెట్టి ఎగుమతులను నియంత్రిస్తున్నాయి ఇంకొక వైపు అభివృద్ధి చెందిన దేశాల తమ తమ కార్పొరేట్ శక్తుల ద్వారా విపరీతమైన దిగుమతులు చేసుకొని భారత్ లాంటి దేశాలలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు కాకుండా చూస్తూ కంపెనీలు లాభాలు గడిపేస్తున్న నేపథ్యాలంలో భారత్ దేశ ప్రభుత్వం మన దేశ రైతులు కుబేర పరిశ్రమలు వీధి వ్యాపారుల రక్షణ కోసం గట్టిగా పోరాడాలని లేదా డబ్ల్యూటీవో నుండి బయటకి రావాలని కోటపాటి నరసింహనాయుడు అబుదాబి వేదికగా డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆహార రంగం ఉద్యోగాలు మందులపై ఉన్న ఆంక్షలు సడలించి స్థిరమైన అభివృద్ధిని కాంక్షించే విధంగా డబ్ల్యూటీవో,నిర్ణయాలు ఉండాలని డిమాండ్ చేశారు.  

అభివృద్ధి చెందిన దేశాలు విధిస్తున్న ఆంక్షలు ముఖ్యంగా రైతులకు ఇచ్చే సబ్సిడీలు బంద్ చేయాలని దానివలన రైతులు వ్యవసాయం మానుకొని పరిస్థితి నెలకొందని సభ్యులకు కోటపాటి నరసింహనాయుడు, వివరించారు. వెనుకబడిన భారత్ నుండి లక్షలాది సంఖ్యలో గల్ఫ్ దేశాలలో అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్న ఇండియన్ వర్క్స్ హక్కులు పరిరక్షించబడాలని కోరారు, కోటపాటి నరసింహ నాయుడు తో పాటు కర్ణాటక నుంచి కురుగురు శాంత కుమార్ కేరళ నుండి కె.వి.రాజు లు సంయుక్త కిషన్ మోర్చా తరపున పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here