ఆర్మూర్ A9 న్యూస్, ఫిబ్రవరి 26:
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల నలంద హై స్కూల్ నందు ఇంగ్లీష్ ఫెస్ట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రాజు, ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యతను విధ్యార్థులు డెబిట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్, ఆక్టివాయిస్ పాసివాయిస్ మరియు డైరెక్ట్ ఇన్డైరెక్ట్ స్పీచ్ లను ఆకట్టుకునే విధంగా నృత్య మరియూ కథ రూపంలో విక్షకుల కు వివరించారు. మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ ఇంగ్లీష్ అనే భాష యూనివర్సల్ భాష అని ఏ కాంపిటీషన్ పరీక్షల కైనా ఉద్యోగుల కైనా ఎక్కడికి వెళ్ళినా గాని ఇంగ్లీష్ అనేది ముఖ్యమైన భాష అని అన్నారు.
ప్రతి ఒక్క పిల్లవాడు స్కూల్ దశ నుంచి ఇంగ్లీషులో మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పారు. నేటి ఆధునిక కాలంలో ప్రపంచ దేశాలకనుగుణంగా ఇంగ్లీష్ ప్రావీణ్యం సంపాదించి విద్యార్థులందరూ ఉన్నత స్థాయిలో దేశ, విదేశాలలో ఉండాలని నలంద యాజమాన్యం ప్రసాద్, సాగర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు వారి యొక్క ఇంగ్లీష్ ప్రదర్శనతో తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఇంగ్లీష్ ఫెస్ట్ లొ ఇంత చక్కటి ప్రదర్శనకు కారణమైన ఇంగ్లీష్ ఉపాధ్యాయులు సమీర్ సార్, భార్గవి మేడం, వాసవి మేడం, ఫాతిమా మేడం మరియు అలినా మేడం ఉపాధ్యాయులను, నలంద మేనేజ్మెంట్ మున్సిపల్ కమిషనర్ రాజు, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల సమక్షంలో మేమొంటోతో సత్కరించారు.