ఆర్మూర్ మండల ప్రజలకు, యువత కు తెలియ జేయునది ఏమనగా
1) నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు తిరగడం,
2) ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కాకుండా నెంబర్ ప్లేట్ ను ఇష్టారీతిలో రాపించడం (improper number plate),
3)రిజిస్టర్డ్ ఒరిజినల్ నెంబర్ కాకుండా తప్పుడు నెంబర్ పెట్టడం (tampered number plate), మరియు
4) వెహికిల్ కొన్నప్పుడు వచ్చిన సైలెన్సెర్ కాకుండా సౌండ్ మోతాదు కి మించి ఎక్కువగా వచ్చే విదంగా సైలెన్సెర్ లను వాడడం (modified silencer) పై వన్నీ మోటర్ వెహికిల్ చట్టం ప్రకారం నేరము
పైన తెలిపినట్టు ఏ బండ్ల కనబడిన వాటిని సీజ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి అని హెచ్చరించారు.
బుధవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లో నెంబర్ ప్లేట్ లేని 9 మోటార్ సైకిల్ లను, నంబర్ ప్లేట్ సరిగా లేని 5 మోటార్ సైకిల్ లు మరియు రిజిస్ట్రేషన్ చేసుకొనివి 7 మోటార్ సైకిల్ లను సీజ్ చేయడం జరిగిందని ఎస్ హెచ్ ఓ రవికుమార్ తెలిపారు.