*భీమ్ గల్ లో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రేడ్డి
సదాశివ్, A9న్యూస్: బాల్కొండ నియోజకవర్గం
ఆడ బిడ్డలకు సన్మార్గంలో నడిపించడానికి, వారికి నాగరికత నేర్పడానికి సేవాలాల్ మహరాజ్ చేసిన కృషి ఎనలేనిది
బంజారా బిడ్డలకు హిందుదైవం గొప్పతనాన్ని తెలియజేసిన మహానుభావుడు,
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి అధికారికంగా నిర్వహించడం అభినందనీయం,
గత ప్రభుత్వంలో సేవాలాల్ మహరాజ్ జయంతి అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకొంటే ఈ ప్రభుత్వం దానిని కొనసాగిస్తూనే ఆయన జయంతి రోజు ఫిబ్రవరి 15 ను సెలవు దినంగా ప్రకటించడం స్వాగతించదగినది.
ఈ సందర్భంగా గిరిజనులు నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బంజారాల అభివృద్ధి కొరకు గత కేసీఆర్ ప్రభుత్వం సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము.
నూతన గ్రామపంచాయతి లు ఏర్పాటు చేయడం, సిసి రోడ్లు, మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు, బిటి రోడ్లు వేయడం, పోడు పట్టాలు అందజేయడం ఇలా అనేక అభివృద్ధి కార్యాక్రమాలు చేయడం జరిగింది అన్నారు..
గత ప్రభుత్వంలో కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో 50 లక్షలతో ఎక్కడ లేనట్టుగా బంజారా భవన్ నిర్మించామని అన్నారు,
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రతి తండాకు తీజ్ భవనాలు మంజూరు చేశామని అన్నారు.. ఈ ప్రభుత్వం ఆ పనులను ఆపివేయాలని అన్నట్టు సమాచారం ఉంది.. కావున తండా పెద్ద మనుషులు అధికారులని కలిసి ఆ పనులను మొదలు చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు..
ఈ పనులు ఒక వ్యక్తి అభివృద్ధి కొరకు మంజూరు ఇచ్చిన పనులు కావని సమూహం లేదా ఆ సంఘం అభివృద్ధి కొరకు మంజూరు చేసిన పనులని ఇందులో అన్ని పార్టీల వారు ఉంటారు అని అన్నారు..
గత ప్రభుత్వము మంజూరు చేసిన అభివృద్ధి పనులను కొత్తగా వచ్చిన ప్రభుత్వం అపాలనుకోవడం సరికాదు అని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పనులను కొనసాగించాలి అన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అధికారి నాగార్రావు, జెడ్పిటిసి రవి, కన్నె సురేందర్, బంజారా నాయకులు, శర్మ నాయక్, తుక్కజి, లింగం, తిరుపతి, నరేష్ మరియు గిరిజన సర్పంచ్, ఎంపిటిసి లు ఎమ్మార్వో లు, ఎంపీడీఓ లు, తండాల పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు..