Monday, November 25, 2024

ప్రధాని మోడీ చిత్రపటానికి మెమోరాండం సమర్పించిన జిల్లా రైతులు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

 

     నిజామాబాదు జిల్లా కేంద్రం లో సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ కే యం, అఖిల భారత రైతు కూలి సంఘంల ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కేంద్రం లో మోదీ చిత్రపటానికి రైతంగా సమస్యల పై వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

      ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు 

 ఆకుల పాపయ్య, AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ గత వారం రోజులుగా ఢిల్లీ పరిసర ప్రాంతంలో, హర్యానాలో రైతులు ఢిల్లీ కేంద్రానికి చెరెందుకు ఆందోళనలు చేస్తున్నారు. వారు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లు గత రైతు ఉద్యమానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ కోరుతున్నారని అన్నారు.MSP పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్ లో తీసుకరావాలని, విద్యుత్ సవరణ బిల్లు 2020 ను ఉపసంహారించాలని , రైతులపై మోపబడిన కేసులను ఏత్తివేయాలని, దేశం లో ఉన్న రైతుల అప్పులను మాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేయాలనీ,రైతు ఉద్యమం లో చనిపోయిన 750 మంది రైతు కుటుంబాలకు నష్ట పరిహారం ఎక్స్ గ్రేషియా చెల్లించి వారి కుటుంబం లో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని తదితర డిమాండ్లతో వారు ఢిల్లీ కేంద్రానికి వస్తున్నారు. వీటినిగతంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు రైతులకు ఇచ్చిన హామీలే.

             రైతుల రాకను హర్యానా ప్రభుత్వం అడ్డగిస్తూ రోడ్లపై మేకులు గొట్టడం, బరికేడ్లు పెట్టడం, భాష్పా వాయువు ప్రయోగించడం, లబ్బరు బులెట్లతో వారిని గాయపరచడం చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని .ఇది కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యను SKM,అఖిలభారత రైతు కూలి సంఘం AIKMS తీవ్రంగా కండిస్తుంది.

             గతంలో చెరుకు పంటకు చక్కర రికవరీ శాతం 8.5శాతం పై నుంచి రైతుకు ధర నిర్ణయించి ఇచ్చేవారని కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దానిని 10.2 శాంతానికి పెంచడం మూలంగా రైతుకు గిట్టుబాటు కావడం లేదని వారు అన్నారు.దేశంలో చక్కెర నిల్వలు తగ్గిపోతున్నాయని అందుకేనేమో ఇతనాయిల్ ఉత్పతులను నిలుపుదల చేసిందని వారు అన్నారు. చెరుకు ఉప ఉత్పత్తుల ద్వారా అనేక లాభాలు వస్తున్నాయని 8.5 శాతం రికవరీ పైనే ధర నిర్ణయించి రైతులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో గల 2 చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించి నడిపించే విదంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.దేశంలో సరిపడ అయిల్ నిల్వలు లేనందున ఇతర దేశాలనుండి దిగుమతులు చేసుకుంటున్నాం. అందుకు గాను నూనెగింజల ఉత్పతులను పెంచాలి ఆయిల్ ఫామ్ పంటలను ప్రోత్సహించాలని వారు కోరారు.

         ఈ కార్యక్రమం లో వేల్పూర్ భూమయ్య AIKMS జిల్లా అధ్యక్షులు,మచ్చర్ల నాగయ్య SKM నాయకులు L చిన్న పార్వయ్య AIKMS జిల్లా ఉపాధ్యక్షులు, అగ్గు చిన్నయ్య AIKMS జిల్లా సహాయ కార్యదర్శి, నాయకులు, శివ కుమార్, అంజయ్య, రాజు,తదితరులు పాల్గొన్నారు

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here