ఇందల్వాయి ఫిబ్రవరి 20 (A9 న్యూస్ ప్రతినిధి జితేందర్ )
ఇందల్వాయి మండల కేంద్రంలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన దొనకంటి గంగాధర్ ఇటు వలె మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ద్వారా దొనకంటి గంగాధర్ కుటుంబానికి నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేతుల మీదుగా లక్ష రూపాయల అందజేయడం జరిగింది. బిజెపి పార్టీలో కార్యకర్తగా చురుకుగా పనిచేసేవాడని తెలిపారు. ప్రతి కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత బిజెపి పార్టీ పైన ఉందని ఎవరు కూడా ఆ దైర్య పడకుండా ఉండాలని భరోసాని ఇచ్చారు. అనంతరం దొనకంటి గంగాధర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తన వంతుగా గంగాధర్ కు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఇంచార్జ్ కులాచారి దినేష్ కుమార్ కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు నాయుడు రాజన్న,,వాసు, తిరుపతి రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.