ఇందల్వాయి ఫిబ్రవరి 20 (A9 న్యూస్ ప్రతినిధి జితేందర్)
*––చిన్నచిన్న విద్యార్థుల ప్రానాలతో చెలగాటం
*––మారూటే సపరేటు అంటున్న డ్రైవర్లు
*––విద్య సంస్థల యజమాన్యం ప్రోద్బలంతో ఈ తతంగం
ఇందల్వాయి మండల కేంద్రంలోని పలు విద్యాసంస్థల బస్సులు రాంగ్ రూట్లో వెళ్తున్నాయి.ఒక్కొక్క బస్సులో సుమారుగా చిన్న చిన్న పిల్లలు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. రాంగ్ రూట్లో బస్సులు నడుపుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటం చేస్తున్నారు.ముందు నుండి వచ్చే వాహనాలు అతివేగంతో రావడంతో రాంగ్ రూట్లో వెళుతున్న ప్రైవేట్ విద్య సంస్థల బస్సులకు అనుకోకుండా జరగరాని సంఘటన జరిగితే భారీ పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విద్యార్థులు అరచేతులలో ప్రాణాలు పెట్టుకుని బస్సులలో వెళ్ళవలసి వస్తుంది. విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రొద్భలంతో డ్రైవర్లు మా రూటే.. సపరేటు అనే చందంగా రాంగ్ రూట్లో బస్సులను నడుపుతున్నారు. వివరాల్లోకి వెళితే ప్రైవేట్ విద్య సంస్థలు అయినా నేషనల్, విక్టరీ, వాణి, తదితర ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు ప్రతిరోజు రాంగ్ రూట్లో వెళ్తున్నాయి.దీనిని అదుపు చేయడంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ట్రాఫిక్ సిబ్బంది కూడా అంటి అంటున్నట్లుగా చూసి చూడనట్లుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని చర్చించుకుంటున్నారు.
ఎంతో కష్టపడి పిల్లలు బాగా చదవాలని పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లకు బస్సులలో పంపితే వారి నిర్లక్ష్యం వల్ల రాంగ్రోట్లలో తీసుకపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులని మండిపడుతున్నారు. ఇకనైనా విద్యాసంస్థల యాజమాన్యాలు తేరుకొని విద్యాసంస్థల బస్సులు రాంగ్ రూట్లో వెళ్లకుండా బైపాస్ రూట్ ను వాడుకోవాలని కోరుతున్నారు.
ఇందలవాయి మండల కేంద్రం దగ్గరలోని టోల్ ప్లాజా వరకు రాంగ్ రూట్లో వెళ్లి అక్కడ నుండి యు టర్న్ తీసుకొని గన్నారం వైపు వెళ్లడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తేరుకొని డ్రైవర్లకు నియమ నిబంధనల ప్రకారం బస్సులు నడపాలని సూచించాలని కోరుతున్నారు.