: మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకొనేందుకు వేల సంఖ్యలో పోటెత్తిన భక్తులు.
మహాజాతర సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన భక్తులు తరలివచ్చారు. ఉదయం నాలుగు గంటల కంటే ముందుగానే వచ్చిన భక్తులతో మేడారం దేవతల గద్దెలు కిటకిటలాడాయి. సుమారు రెండు లక్షల మంది వచ్చి ఉంటారని ఆలయ కార్యనిర్వహణాధికారి రాజేంద్రం తెలిపారు.
*అందుబాటులోకి ‘మై మేడారం’ యాప్*
మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ‘మై మేడారం’ యాప్ రూపొందించింది. స్మార్ట్ ఫోన్‌లో ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని సౌకర్యాలు, సేవల వివరాలు పొందొచ్చు. ఇందులో రెండు కేటగిరీలు వస్తాయి. మొదటి కేటగిరీలో నీరు, వైద్య, పార్కింగ్, శౌచాలయాలు, స్నానఘట్టాల వివరాలు ఉంటాయి. రెండో కేటగిరీలో తప్పిపోయిన వారి వివరాలు వెల్లడించేలా మిస్సింగ్ అలర్ట్స్, రిపోర్ట్ మిస్సింగ్, ఫైర్ ఇంజిన్ సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు.