Monday, November 25, 2024

భీమ్ గల్ లో జోరుగా పేకాట – చోద్యం చూస్తున్న అధికారులు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ a9న్యూస్ పిబ్రవరి 7:

 

-* జోరుగా పేకాట….

 

– * ఆట చోటే వడ్డీ వ్యాపారం…

 

– *సరదాగా మొదలై.. ఆ తర్వాత బానిసై జేబులు గుల్ల..

 

 – *రహస్య ప్రదేశాలే అడ్డాలు…

 

– *ఆకర్షితులవుతున్న యువకులు…

 

– *రోడ్డున పడుతున్న కుటుంబాలు….!

 

– *నిద్ర మత్తులో అధికారులు

బాల్కొండ నియోజకవర్గంలో పేకాట జోరుగా కొనసాగుతుందని పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పేకాట సరదాగా మొదలై.. ఆ తర్వాత బానిసై జేబులను గుల్లచేస్తున్నది. బాల్కొండ, మెండోరా, భీమ్ గల్, కమ్మర్ పల్లీ, మోర్తాడ్, వేల్పూర్ మండల కేంద్రంలోగల గ్రామాల శివారు, ప్రాంతంల్లో జోరుగా పేకాట నిర్వహిస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

 

– *రహస్య ప్రదేశాలే అడ్డాలు…

 

పేకాట రాయుళ్ళు పోలీసులకు, కుటుంబ సభ్యులకు, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గ్రామ శివారులోని రహస్య ప్రదేశలను అడ్డాలుగా ఎంచుకొని జోరుగా పేకాట నిర్వహిస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఏ పనులు చేయకుండా పేకాటనే వృత్తిగా మలుచుకున్నారు. పేకాట ప్రదేశంలో చిన్నాచితక గొడవలు జరిగి దాడులు జరిగిన సందర్బాలు లేకపోలేదు. అదేవిధంగా గ్రామ శివారుల్లో కోనసాగుతున్న పేకాట అనేక కుటుంబాలను రోడ్డున పడేస్తుందని భాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు సుమారు లక్షల రూపాయల వరకు జూదం నిర్వహిస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేకాట స్థావరాల పై అధికారుల నిఘా కొరవడిందని పలువురు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర నుండి పేకాట రాయుళ్ళు పేకాట స్థావరానికి చేరుకొని సుమారు లక్షల రూపాయల వరకు పేకాట ఆడుతున్నారనే ఆరోపణలు గుప్పు మంటున్నాయి. పేకాట స్థావారాల వద్ద మందు, విందు, చిందు జోరుగా నిర్వహిస్తున్నారని, సమాచారం అందించడానికి సుమారు 10 మందిని ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున డబ్బులు అందజేస్తున్నారనే ఆరోపణలు వెలువేత్తుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో పేకాట నిర్వహిస్తున్న కూడా అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని, ఒక వేళ అధికారులకు ముడుపులు ముట్ట చెప్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేకాట వలన కొన్ని కుటుంబాలు రోడ్డున పడిన సంఘటనలు ఉన్నాయని, పేకాట కోసం ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు తాకట్టు పెట్టి మరి జోరుగా పేకాట నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

– *ఆట చోటే వడ్డీ వ్యాపారం

పేకాట ఆడేందుకు వచ్చిన జూదరులు ఆట ఓడి పోయి తెచ్చిన డబ్బంతా కోల్పోతారు. అలాంటి వారు తిరిగి ఆటను కొనసాగించేందుకు డబ్బులు అప్పుగా ఇచ్చేవారికీ ఇక్కడ కొదవలేదు. పేకాటలో ఆ స్తులు సైతం కోల్పోయి రోడ్డునపడినవారు లేకపో లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పేకాట శిబిరాల వద్ద వడ్డీలకు అప్పులు ఇచ్చి భారీగా సంపాదిస్తున్నారని, ఆటలో డబ్బులు పోగొట్టుకున్నవారికి అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నారు. చేతిలో డబ్బులు పడగానే మళ్లీ ఆటలో కూర్చుంటున్నారు. గెలిస్తే అప్పులు తీర్చి సరదాగా ఉంటారు. అప్పు తీసుకున్న డబ్బు కూడా పోగొట్టుకున్న జూదరులు రెండు విధాలా దెబ్బ తగులుతుంది. సొంత డబ్బు పోగొట్టుకోగా చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోజువారీ, వారం, నెలవారీగా వడ్డీలకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గెలిస్తే సరే ఓడిపోతే సొంత ఆస్తులను సైతం అమ్ముకోవల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పేకాటతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు పేకాట స్థావరాలను గుర్తించి కళ్లెం వేయాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మొక్కుబడి దాడులతో సరి పెట్టకుండా అసలు సూత్రధారు లెవరో తెలుసుకొని కట్టడి చేయాలని కోరుతున్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here