నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 5:

అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, విధానాలను చేపడుతూ ప్రధాని నరేంద్ర మోడీ రైతులను భూముల నుంచి, కార్మికులను ఉపాధి నుంచి, తొలగించి రోడ్లమీద పడేసే చర్యలకు పూనుకున్నాడు. వీరి విధానాలను వ్యతిరేకిస్తూ దేశంలో బలమైన రైతాంగ కార్మిక ఉద్యమాలు తీసుకురావాల్సిన బాధ్యత రైతు సంఘాలపై కార్మిక సంఘాలపై ఉందని అదే వెలుగులోనే ఎస్కేయం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న గ్రామీణ భారత్ బంద్ ను, పారిశ్రామిక సమ్మెను నిర్వహించుచున్నామని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యాలయం ఎన్ ఆర్ భవన్ కోట గల్లి లోని ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వేల్పూరు భూమయ్య మాట్లాడుతూ 16న నిర్వహించే బందులో రైతులు, కార్మికులు, ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొని మోడీ ప్రభుత్వానికి బలమైన నిరసన తెలియజేయాలని ఆయన తెలియజేశారు.

గత రైతాంగ ఉద్యమానికి తలోగ్గిన మోడీ తాను తెచ్చిన రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేసినట్లు ప్రకటించి, రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పి తిరిగి దొడ్డి దారిన మళ్లీ మూడు చట్టాలను తీసుకువచ్చే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఎంఎస్పి మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని పార్లమెంటులో తీసుకువస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ దేశ రైతాంగాన్ని మోసం చేశారని అన్నారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని, భూమయ్య కోరారు .భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠంపై నిలబెడుతూ రైతులను తమ భూముల నుండి భేదకల్ చేసి అట్టి భూములను తన అశ్రీత కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులైన ఆదాని, అంబానీ, లకు కట్టబెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.

ఎన్ సి ఎస్ ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రంలో సహకార రంగంలో కొనసాగిన ఫ్యాక్టరీ గత ప్రభుత్వాల విధానాల వల్ల మూతపడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్టరీని తెరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపించి నడిపించాలని భూమయ్య డిమాండ్ చేశారు.

దీనితోపాటు కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోర్టులు తెచ్చి కార్మికుల శ్రమశక్తిని దోచుకుంటున్నారని కార్మికుల ఉపాధి పై దెబ్బ కొట్టుతున్నారని భూమయ్య దుయ్యబడ్డారు.

ఈనెల 16న జరిగే గ్రామీణ భారత్, పారిశ్రామిక బందును గ్రామీణ ప్రాంతాలలో ట్రాక్టర్ల ర్యాలీలు, బైక్ ర్యాలీలు, రైతులు గ్రామ కూడలలు వీధులలో నిరసన తెలియజేయాలని ఈ సందర్భంగా భూమయ్య కోరారు.

ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి, ఉపాధ్యక్షులు హగ్గు ఎర్రన్న, బి.సాయిలు, టి.కృష్ణ గౌడ్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, నాగేష్, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *