కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 7:
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో గణితశాస్త్రం బోధిస్తున్న ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు రవీందర్ ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్ది ప్రధానోపాధ్యాయుడు లేకుండా ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడిగా మరియు గణిత శాస్త్రం బోధిస్తూ అదేవిధంగా భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో 11 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తూ బదిలీపై వెళ్తున్నందుకు ఇంచార్జి హెచ్ఎం రవీందర్ కు విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
విద్యార్థులతో కలిసిమెలిసి ఉండేవాడని విద్యార్థులను వారి బిడ్డలుగా పాఠశాలలో చూసుకోవడం విద్యార్థి తల్లిదండ్రులు ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు రవీందర్ బదిలీపై వెళ్లడం బాధాకరమని విద్యార్థి తల్లిదండ్రులు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలలో అభివృద్ధి చేయాలంటే తన సొంత ఖర్చుతో భూంపల్లి పాఠశాలను అభివృద్ధి చేసేవాడని ప్రత్యేక శ్రద్ధ చూపి విద్యార్థులను తీర్చిదిద్దేవాడని ఉదాహరణకు భూంపల్లి గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి గైని శ్రీకాంత్ అనే యువకుడు బుధవారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రిపోర్టర్ గా వర్క్ చేస్తున్న గైని శ్రీకాంత్ ను తీర్చిదిద్దిన ఘనత ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు రవీందర్ కి దక్కుతుందని పూర్వ విద్యార్థి గైని శ్రీకాంత్ అన్నారు.
భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు రవీందర్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లోకేశ్వర్ రావు ఉపాధ్యాయులు శ్రీనివాస్ యాదవ్, రవికుమార్, పోచయ్య మేహీరునిస, హైమావతి, ఉమాదేవి, రాధా, మరియు విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.