సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి ప్రతీక – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్….

On: Monday, August 18, 2025 3:38 PM

 

మెదక్, ఆగస్ట్ 18 (ఎ9 న్యూస్):

తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి స్ఫూర్తిగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఘనంగా స్మరించారు. సోమవారం మెదక్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆయన 375వ జయంతి వేడుకలు నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, “అన్ని వర్గాలను ఐక్యంగా కదిలించి, అప్పటి నియంతృత్వ, నిరంకుశ శక్తులపై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాగించిన పోరాటం ప్రేరణాత్మకం. ఆయన జీవితం నేటి తరాలకు మార్గదర్శకం” అని చెప్పారు.

పాపన్న గౌడ్‌ల వంటి మహనీయుల ఆశయాల బాటలో తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని కలెక్టర్ వివరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ డీవో గంగా కృష్ణ, జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షుడు రమేష్ గౌడ్, ఇతర కమ్యూనిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

14 Feb 2026

Leave a Comment