నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 3:
దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఫిబ్రవరి 16న సమ్మెకు పిలుపునిచ్చిన సందర్భంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లాలోని అంగన్వాడీ ఉద్యోగులందరూ సమ్మె నిర్వహించాలని యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ.రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు, మతత్వ విధానాలకు అనుకూలంగా వివరిస్తున్నదని అదేవిధంగా గత పది సంవత్సరాల కాలంలో ఐసిడిఎస్ కు 60 శాతం బడ్జెట్ను తగ్గించిందని దీనివల్ల ఐసిడిఎస్ బలహీన పడుతుందని అందువల్లనే అంగన్వాడీ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందడం లేదని పక్కా భవనాలు కట్టించట్లేదని మౌలిక వసతులు కల్పించట్లేదని ఆయన అన్నారు. 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులను స్కీం వర్కర్లను కార్మికులకు గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని, ఈ.ఎస్.ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలని నిర్ణయం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అందువల్ల ఇప్పటికైనా అంగన్వాడీ ఉద్యోగులకు నెలకు 26000 కనీస వేతనం చెల్లించాలని పదివేల రూపాయలు పెన్షన్స్ సౌకర్యాన్ని కల్పించాలని లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 16న జరిగే సార్వత్రిక సమ్మెలో అంగన్వాడి అందరూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే.దేవగంగు, పి.స్వర్ణ, కోశాధికారి చంద్రకళ, ఉపాధ్యక్షులు మంగాదేవి మరియు జిల్లా నాయకులు సూర్య కళ, విజయ, లావణ్య, జ్యోతి, వాణి, యమునా, లక్ష్మి, జగదాంబ తదితరులతో పాటు సెక్టర్ లీడర్లు పాల్గొన్నారు.