కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 3:
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ నెంబర్ ఎస్ఎస్ 3 వద్ద విద్యుత్ స్తంభం వంగి ఉన్నదని. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న విద్యుత్ అధికారి లైన్మెన్ విజయ్ జూనియర్ లైన్మెన్ హైమద్ ను సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ అధికారులు, వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న బోరు దగ్గర ఉన్న విద్యుత్ బిల్లు కట్టుకోవాలని లేదంటే విద్యుత్ పోల్ తీసివేసివేరా జాగాలో కొత్త విద్యుత్ స్తంభం అమర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ అధికారులు పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ స్తంభం వంగి ఉండడం విద్యుత్ అధికారులు లైన్మెన్ విజయ్ జూనియర్ లైన్ మెన్ హైమద్ వారిద్దరూ చూడడం జరిగింది. విద్యుత్ అధికారులు చూసిన కానీ విద్యుత్ మరమ్మతులు చేపట్టాలి కానీ విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యుత్ అధికారులు లైన్ మెన్ విజయ్ జూనియర్ లైన్ మెన్ హైమద్ ను సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ అధికారులు రైతులపై చిన్నచూపు చూస్తున్నారని రైతులు లైన్మెన్ విజయ్ పై జూనియర్ లైన్మెన్ హైమద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా స్పందించి భూంపల్లి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రం వద్ద ట్రాన్స్ఫార్మర్ ఎస్ఎస్3 విద్యుత్ పోల్ వంగి ఉంది వేరే విద్యుత్ పోల్ అమర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.