నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 2:

– డొమెస్టిక్ కు చెందిన నాలుగు గ్యాస్ సిలిండర్ల పట్టివేత…

– కేసు నమోదు చేసిన సివిల్ సప్లై అధికారులు…

– అగ్నిమాపక శాఖ అధికారి తనిఖీ…

– మండల ఆర్ఐ పరిశీలన…

– నిబంధనలు పాటించనట్లయితే చర్యలు తీసుకుంటాం…

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆర్మూర్ లోని డాల్ఫిన్ బెంగళూరు బేకరీని మూడు శాఖల అధికారులు తనిఖీ చేశారు. బేకరీలో గృహ వినియోగానికి ఉపయోగించిన గ్యాస్ సిలిండర్లు పట్టుబడడంతో సివిల్ సప్లై అధికారులు కేసు నమోదు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ పెట్రోల్ పంపు ఎదురుగానున్న డాల్ఫిన్ బెంగళూర్ బేకరీ లో కుళ్ళిన కేకులు విక్రయిస్తున్నారని వార్తల కథనాల పై వివిధ శాఖలకు చెందిన అధికారులు స్పందించి శుక్రవారం తనిఖీలు చేశారు.

డాల్ఫిన్ బేకరీని అగ్నిమాపక అధికారి మధుసూదన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండంతస్తుల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవలసిన పరికరాలు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే బాధ్యులు ఎవరని దుకాణ యజమానిని నిలదీశారు. బేకరీలో అగ్నిమాపక పరికరాలు అమర్చాలని లేనట్లయితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆ తర్వాత ఆర్మూర్ సివిల్ సప్లై నాయబ్ తాసిల్దార్ వినోద్ కుమార్, శ్రీనివాస్ లు బేకరీ దుకాణంలోని వంటగదిని పరిశీలించగా గృహ వినియోగానికి సంబంధించిన నాలుగు గ్యాస్ సిలిండర్లు పట్టుబడ్డాయి. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి కేసు నమోదు చేశారు. గృహానికి వినియోగించవలసిన సిలిండర్లు బేకరీలోని దుకాణంలో అక్రమంగా వినియోగిస్తున్నందున కేసు నమోదు చేశామని అధికారులు వివరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న బేకరీ దుకాణాన్ని మండల రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్ అశోక్ సింగ్ పరిశీలించారు. బేకరీలో ఆహార పదార్థాల తయారీ అద్వానంగా ఉండడం పట్ల దుకాణంలో పనిచేస్తున్న వారిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *