నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 1:
-* ఫోన్ చేసిన లిఫ్ట్ చేయని ఫుడ్ ఇన్స్పెక్టర్…
-* స్పందించని ఫుడ్ ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకోవాలి…
-* బేకరీలో కేక్ లను పరిశీలించిన సానిటరీ ఇన్స్పెక్టర్…
-* దుకాణాన్ని సీజ్ చేయాలని బాధితుల డిమాండ్…
ఆర్మూర్ పట్టణం బాలాజీ పెట్రోల్ పంపు ఎదురుగా నున్న డాల్ఫిన్ బెంగళూర్ బేకరీలో కుళ్ళిన కేక్ లు విక్రయించడంతో పలువురికి అస్వస్థత అయింది. గురువారం పుట్టినరోజు వేడుకల కోసం తీసుకెళ్లిన కేక్ ను తిన్న వారికి కడుపులో వికారం అయింది. డాల్ఫిన్ బెంగళూరు బేకరీలో కుళ్ళిన కేక్ లు విక్రయించడంతో దుకాణ యజమానికి కుళ్ళిన కేక్ ను చూపించారు. బాధితులు కుళ్ళిన కేక్ ను చూయించిన యజమాని పట్టించుకోక నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి కి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. దీంతో తార్య నాయక్ కు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి బేకరీ దుకాణాన్ని సీజ్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. కుళ్లిన కేక్ తినడంతో బాధితులకు గొంతులో నొప్పి కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. దీంతో ఆర్మూర్ ఇన్చార్జి కమిషనర్ భూమేశ్వర్, సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ కు ఫిర్యాదు చేయడంతో బేకరీ దుకాణానికి వచ్చి కుళ్ళిన కేకులను పరిశీలించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న బేకరీ దుకాణం యజమానిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. బేకరీ దుకాణాన్ని సీజ్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. బేకరీ షాప్ కు చెందిన కొందరు బాధితులు జర్నలిస్టులను సైతం బెదిరించారు.