కామారెడ్డి A9 న్యూస్, జనవరి 31:
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బుధవారం జగడం నరేష్ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు, ఈ సందర్భంగా సిఐ జగడం నరేష్ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడతానని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించే వారి సమాచారం పోలీసులకు అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది సిఐ జగడం నరేష్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.