నిజామాబాద్ A9 న్యూస్ జనవరి 27:
* ఉపాధ్యాయులే ఇల వ్యవరిస్తే విద్యార్థులకి దేశం విలువ ఎలా తెలుస్తుంది..?
* దేశభక్తి ఎలా పెరుగుతాయి..?
నారాయణ యజమాన్యపై బురద చల్లి నిరసన తెలియజేసిన (టిజివిపి) నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ నిజామాబాద్ లోనీ కొన్ని కార్పొరేట్ కళాశాలలు మరియు పాఠశాలల యాజమాన్యాలు రోజు రోజుకి దిగజారి ప్రవర్తిస్తున్నాయి అని విమర్శించారు. విద్యాశాఖ అధికారులని, ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదు. అదేవిధంగా భారత రాజ్యాంగానికి కూడా విలువనీయని పరిస్థితి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది నిన్న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ జెండా ఎగరవేసిన తర్వాత జెండాకు వందనం చేయాల్సి ఉండగా వందనం చేయకుండా అగౌరవ పరచడం జరిగింది, ఉపాధ్యాయులే ఇల వ్యవరిస్తే విద్యార్థులకి దేశం విలువ, దేశభక్తి ఎలా పెరుగుతాయి? ఇదే విధంగా అనేక మార్లు తప్పులు కార్పొరేట్ పాటశాల అయిన నారాయణ పాఠశాలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. విద్యాశాఖ నియమ నిబంధనలు కూడా వీరికి వర్తించవు అనే చందంగా వ్యవహరిస్తున్నారు, విద్యాశాఖ అధికారి మాటలు కూడా వీళ్ళు లెక్క చేయడం లేదు నిన్నటిరోజు రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు జెండాకు వందనం చెయ్యకుండా. ఈ విధంగా వ్యవహరించడం సిగ్గుచేటు కాబట్టి నారాయణ యజమాన్యం శివాజీ పటేల్ మరియు జెండాని అగౌరవపరిచినటువంటి మహిళా ప్రిన్సిపల్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని,సరైన అనుమతులు లేని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ,యాజమాన్యం చిత్ర పటానికి బురద చల్లి నిరసన తెలపడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తునం ఇలాంటి అగౌరపరిచే కార్యక్రమం చేసినటువంటి ఎవరైనా సరే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ గా డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు అఖిల్, సుజిత్, వినీత్, రాజేష్ లడ్డు తదితరులు పాల్గొన్నారు.