Tuesday, November 26, 2024

మున్సిపల్ అవిశ్వాసం నెగ్గింది.. కొత్త చైర్ పర్సన్ ను ఎన్నుకుంటాం

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్ ఆర్మూర్, జనవరి 27:

* చైర్ పర్సన్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు ఉత్తర్వులో తెలిపారు..

* కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు..

* అధికార దాహంతో వ్యవహరిస్తున్నారు..

* అవిశ్వాసం నెగ్గిందని అధికారులు తీర్మానాన్ని పంపారు..

* బిఆర్ఎస్ కౌన్సిలర్ల వెల్లడి..

ఆర్మూర్ మున్సిపల్ లో ఈనెల 4వ తేదీన జరిగిన అవిశ్వాస పరీక్షలో 24 మంది సభ్యులు మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్ కు వ్యతిరేకంగా చేతులెత్తినందున అవిశ్వాసం నెగ్గిందని, కొత్త చైర్ పర్సన్ ను ఎన్నుకోవడానికి జిల్లా కలెక్టర్ తేదీలను ప్రకటించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, కౌన్సిలర్లు ఆకుల రాము, జాహీర్, గంగామోహన్ చక్రు, నాయకులు సుంకరి రంగన్న, రెహమాన్ లు చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రెస్ క్లబ్ భవనంలో శనివారం బీఆర్ఎస్ కౌన్సిలర్లు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రజలు, కౌన్సిలర్లతో అవిశ్వాసాన్ని కోల్పోయిన మున్సిపల్ చైర్ పర్సన్ వర్గం వారు అవాకులు, చవాకులు చెప్పడం అవాస్తమన్నారు. వాస్తవానికి మున్సిపల్ లో 36 మంది కౌన్సిలర్ ఉండగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి ఎక్స్ ఆఫీషియోగా ఓటు హక్కు కల్పించలేదన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియోగా పేరు నమోదు చేసుకొని కౌన్సిలర్లతో పాటు కూర్చొని ఓటు వేశారన్నారు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ ద్వంద వైఖరి అవలంబిస్తూ ఓటమి చెందిన తర్వాత మున్సిపల్ కౌన్సిల్ కు ఏ విధంగా వస్తారన్నారు. టెక్నికల్ గా బలపరీక్ష తేదీ ఖరారు ఉత్తర్వు జారీకావడంలో జాప్యం జరుగుతుందన్నారు. 4 సంవత్సరాల పాలనలో పట్టణాన్ని ఏలాంటి అభివృద్ధి చేయకుండా మున్సిపల్ చైర్ పర్సన్

అధికార దాహంతో వ్యవహరించారని విమర్శించారు. గత మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ కారు గుర్తుతో పోటీ చేసి గెలిచి, కాంగ్రెస్ వంచన చేరి వారితో ఒత్తిడి చేయిస్తున్నారన్నారు.

అవిశ్వాసం నెగ్గిందని ఆర్డిఓ, కమిషనర్ ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపిన ప్రతుల కాఫీలను ప్రదర్శించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పోస్టు ఖాళీ ఉందని ప్రభుత్వం ఏ విధంగా ఉత్తర్వు జారీ చేసిందని వారు ప్రశ్నించారు. ఏడాది కాలవ్యవధి ఉన్న మున్సిపల్ లో కౌన్సిలర్లకు ప్రలోభాలకు గురిచేసి వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గతంలో పండిత్ వినీత పవన్ మంచి వ్యక్తి అని భావించి చైర్ పర్సన్ పదవి ఇస్తే వెన్నుపోటు పొడిచి తగిన గుణపాఠం నేర్పించారన్నారు. అవిశ్వాసం విగిపోయిందని భావిస్తే మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకలకు చైర్ పర్సన్ వినీత ఎందుకు హాజరు కాలేదని వారు ప్రశ్నించారు.

ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఆర్డీవో వినోద్ కుమార్ మీడియా సమావేశంలో అవిశ్వాసం నెగ్గిందని ప్రకటించడం వాస్తవం కాదా అని వారన్నారు. జిల్లా కలెక్టర్ ఉత్తరులో మాజీ చైర్మన్ అని పేర్కొనడాన్ని వారు ప్రస్తావించారు. ఆర్డీవో పై కాంగ్రెస్ నాయకులతో ఒత్తిడి తీసుకొచ్చి మరో తీర్మానం పంపినట్లు తెలిసిందన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ వర్గం వారు మద్దతు ఇవ్వాలని కోరుతు కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నును ఇన్చార్జి చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చి, చైర్మన్ ను ఎన్నుకోవడానికి తేదీని ప్రకటించాలని కోరారు. మున్సిపల్ విషయంలో కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకొని మైనార్టీ నాయకుడు షేక్ మున్నుకు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వకుండా అడ్డుకుంటే వచ్చే లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు మద్దతు ఇవ్వాలా వద్దా అనే విషయం పై ఆలోచిస్తామన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు ఇట్టడి నర్సారెడ్డి, ఇలియాస్, భారడ్ రమేష్, లిక్కి శంకర్, వనం శేఖర్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, బీఆర్ఎస్ నాయకులు అతిక్, ఖాందేష్ పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here