A9 న్యూస్ జనవరి 27 (హైదరాబాద్ ప్రతినిధి):
పార్లమెంట్ ఎన్నికల నగారా మోగకముందే పోలీస్ శాఖలో బదిలీల పర్వం ప్రారంభమైంది. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఐపీఎస్ ల బదిలీలను చేసిన విషయం తెలిసిందే. శనివారం తెలంగాణ మల్టీ జోన్ 1వ పరిధిలో పలువురు సివిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్ వన్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ తరుణ్ జ్యోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్డర్ నెంబర్ 33, 36 లో భాగంగా పలువురు సీఐలకు స్థానాచలనం కల్పించారు. ఈ బదిలీలలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని పలువురు సీఐలను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి. నిజామాబాద్ సీఎస్బి 3 లోని శ్రీనివాసును ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న శ్రీనివాసరాజును నిజామాబాద్ సీసీఆర్బీకి బదిలీ చేశారు.
జైనాథ్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్న నరేష్ ను బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమించారు.
ఆర్మూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్న గోవర్ధన్ రెడ్డిని ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కోరగా, ఆయన స్థానంలోకి కామారెడ్డి డీసీఆర్ బీ లో ఉన్న కె. శ్రీధర్ రెడ్డిని నియమించారు.
నిజామాబాద్ కేసీఆర్ లో ఉన్న వెంకటయ్యను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
కామారెడ్డి ఎస్బీ 2 గా ఉన్న సంతోష్ కుమార్ ను సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నియమించారు.
సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న ఎస్. రామన్ ను ఐజీ కార్యాలయంకు రిపోర్ట్ చేయాలని కోరారు.
ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న శ్రీనివాసులు ఐజీ కార్యాలయంకు బదిలీ చేశారు.
బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ రెడ్డి బోయిన కృష్ణ ఐదవ కార్యాలయానికి ట్రాన్స్ఫర్ చేశారు.
సిద్దిపేట టాస్క్ ఫోర్స్ వన్ సీఐ గా ఉన్న జగడం నరేష్ బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ గా ఉన్న చందర్ రాథోడ్ ను సీఎస్బీకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
నిజామాబాద్ సీఎస్ బీ 2 లో కె. ముత్యాలు ను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
సిద్దిపేట 2 వ టౌన్ ఎస్ హెచ్ ఓ కె.రవికుమార్ ను ఆర్మూర్ ఎస్హెచ్వో గా నియమించారు.
ఆర్మూర్ ఎస్హెచ్ఓ గా ఉన్న సురేష్ బాబును ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని తెలిపారు.
సిద్దిపేట సీఎస్ బి 3 ఉన్న సురేందర్ ను ఖాళీగా ఉన్న ధర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నియమించారు.
నిర్మల్ సీసీఎస్ లో ఉన్న కె.మల్లేష్ ను దిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నియమించారు.
అక్కడ ఉన్న కృష్ణను ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కోరారు.
బోధన్ ఎస్ హెచ్ ఓ బీడీ ప్రేమ్ కుమార్ ను నిజామాబాద్ సీసీఎస్ కు బదిలీ చేశారు.
నిజామాబాద్ సీసీఎస్ లో ఉన్న వీరయ్యను బోధన్ ఎస్హెచ్ఓ గా నియమించారు.