నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలోని తాజ్ ఫంక్షన్ హాల్ లో ప్రజాస్వామిక స్ఫూర్తి సభ రాజకీయ పార్టీల ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలారి సత్యం హత్యపై విచారణకు ప్రభుత్వాన్ని కోరుతాం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి శిక్ష పడే వరకు పోరాటం చేస్తాం వి. ప్రభాకర్ ప్రజాపంథా తలారి సత్యం కి వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అందరం ఒకటై పోరాడుతాం రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. దళిత యువకులైన విద్యావంతులైన తలారి సత్యం చేపూర్ రవీల 8వ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ లోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ దళిత యువకులు అయిన తలారి సత్యం చీపురు రవి కలిసి వస్తున్నారని ప్రశ్నిస్తే గొంతును తొక్కి వేయాలని ఒక అహంకార భావంతో అప్పటి ఎమ్మెల్యే ఆశన్న గారి జీవ రెడ్డి వారిని హత్యగాంచారు నేటికీ 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు కూడా ఆ హత్యలు చేయించిన దోషులకు శిక్ష పడకపోవడం కావున తలారి సత్యాన్ని అండగా వారి కుటుంబానికి అండగా న్యాయం జరుగెంతవరకు పోరాడుతామని నాయకులు అన్నారు. ప్రభుత్వానికి కూడా మేము విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. ఆధ్వర్యంలో సంవత్సరంలో పోరాడుతున్న ఇప్పటివరకు కూడా ఎలాంటి న్యాయం జరగకపోవడం బాధాకరమని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ విషయంపై అవగాహన ఉందని వారు చొరువ తీసుకోవాలని తెలియజేశారు.CPIML ప్రజాపంథా మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి. దేవారం, సబ్ డివిజన్ కార్యదర్శి బి. కిషన్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ దేగం ప్రమోద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, టిడిపి నిజాంబాద్ పార్లమెంట్ సభ్యులు దేగం యాదవ్ గౌడ్, సిపిఐ నాయకులు ఆరెపల్లి సాయిలు, అంబేద్కర్ సంఘ నాయకులు, జేఎసి అధ్యక్షులు సావెల్ గంగాధర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, ప్రజాసంఘాల నాయకులు తదితర ఉద్యమ పార్టీ సానుభూతిపరులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు తలారి సత్యం కు న్యాయం జరిగింతవరకు పోరాడుతామని తలారి సత్యం ది కుట్ర పూరిత హత్యానని దానికి కారణమైన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తలారి సత్యం కు న్యాయం జరిగేంత వరకు తమకు మేము కూడా అండగా ఉంటామని. తలారి సత్యం హత్యపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వారు కూడా ఈ ఘటన పై విచారణకు ఆదేశించాలని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.