నిజామాబాద్ A9 న్యూస్:
వర్గ పోరాటం తీయడం చేయడమే మార్క్సిస్టు మహా ఉపాధ్యాయులు కు నిజమైన నివాళి అవుతుందని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సిరికొండ సబ్ డివిజన్ *కార్యదర్శి వి.బాలయ్య* అన్నారు.
లెనిన్ శత వర్ధంతి సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో లెనిన్ స్మారక సభను నిర్వహించారు. బాలయ్య మాట్లాడుతూ, రష్యా దేశ నిర్దిష్ట పరిస్థితికి మార్క్సిజాన్ని అన్వయించి, విప్లవం సాధించడంలో కీలకపాత్ర నిర్వర్తించారని ఆయన తెలిపారు. “ఏమి చేయాలి” అనే గ్రంథాన్ని లెనిన్ రచనను
విప్లవ కమ్యూనిస్టు కార్యకర్తలు అందరూ తప్పకుండా అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. ఘర్షణ లేకుండా చరిత్రలో మార్పు లేదని, మానవాళి విముక్తి కోసం సాగే విప్లవ రహదారికి లెనిన్ దిక్సూచి అని ఆయన అన్నారు. లెనిన్ జీవితం కమ్యూనిస్టు విప్లవ కారులకు స్ఫూర్తి అని ఆయన కొనియాడారు. దేశంలో విప్లవ కారులు, దళితులు , ఆదివాసులు,మైనార్టీలు వివక్షతకు అణచివేతకు గురి చేయబడ్డ ప్రజలందరినీ ఐక్యం చేసి మతోన్మాదని ఓడించాలని బాలయ్య పిలుపునిచ్చారు.
నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు, పేదల జన్ధన్ ఖాతాలో 15 లక్షల జామ, ప్రభుత్వ రంగ సంస్థల వేలం అని, ఉపాధి భద్రత కాపాడాలని బాలయ్య డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు పిట్ల మార్క్స్, నిమ్మల భూమేష్, వి.పద్మ, మల్కిసంజీవ్ గులాం హుసేన్, కృష్ణ, నరేష్ గౌడ్, శివరాజ్, నర్సగౌడ్, చిన్న గంగాధర్, హోటల్ సాయికుమార్, గొల్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు.