నిజామాబాద్ A9 న్యూస్:
*న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు
మానవాళి విముక్తి ప్రదాత లెనిన్ శతవర్ధంతి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆర్మూర్లో ఐఎఫ్టియు ఆఫీసులో నిర్వహించారు లెనిన్ ఫోటోకు పూలమాలతో అలంకరించి; నివాళి అర్పించారు. న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు మాట్లాడుతూ మార్క్సిజం లెనినిజం అజేయం అని ఆయన అన్నారు.
లెనిన్ మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథాన్ని శాస్త్రీయంగా అవగాహన ఏర్పరచుకొని రష్యాలో విప్లవం తీసుకురావడానికి కృషి చేశాడని ఆయన తెలిపారు.
మార్క్సిజంలోని విప్లవకర అత్యంత శాస్త్రీయ వర్షాలను కలిపి ఉంచడం ద్వారానే విప్లవ లక్ష్యమైన మానవాళి విమోచన సాధ్యమవుతుందని వివరించారని ఆయన తెలిపారు. “విప్లవం అంటే విందు భోజనం కాదని కత్తుల వంతెన పై ప్రయాణం లాంటిదని ” ఆయన అన్నారు. సామ్రాజ్యవాదం గూర్చి లెనిన్ రూపొందించిన సిద్ధాంతం ఒక మహత్తర సైదాంతిక విజయమని, అది ఒక సత్యమని ప్రపంచంలో రుజువు చేయబడిందని ఆయన తెలిపారు.
నేడు భారతదేశంలో మతోన్మాద బిజెపి పరిపాలన చేస్తోందని, లౌకిక ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తోందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే ప్రక్రియ ఆలోచనతో పనిచేస్తుందని తెలిపారు.
దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి, మతం, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తుందని ఆయన అన్నారు.
ప్రజలకు నరేంద్ర మోడీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను గత పది సంవత్సరాల పాలనలో అమలు చేయకుండా మోసం చేసిందని ఆయన అన్నారు.
లెనిన్ జీవిత స్ఫూర్తితో భారతదేశ విప్లవానికి కృషి చేయవలసిన బాధ్యత విప్లవ సంస్థలపై ఉందని ఆయన అన్నారు. మతోన్మాద బిజెపికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజల్ని ఐక్యం చేసి న్యూ డెమోక్రసీ ఉద్యమిస్తోందనీ దాసు తెలిపారు.
ఈ కార్యక్రమం సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి సూర్య శివాజీ, అధ్యక్షతన జరిపారు. ప్రపంచ శ్రామిక వర్గానికి మార్క్సిజమే దిక్సూచి అని శివాజీ అన్నారు. ప్రజా సంఘాల నాయకులు పి వై ఎల్. ఎస్ రవి, ఎస్ వెంకటేష్, ఐఎఫ్టియు నాయకులు భానుచందర్, గంజి రాజారాం, సొప్పరి గంగాధర్, రాజన్న, పి డి ఎస్ యు పి ఓ డబ్ల్యు, నాయకులు బి ప్రిన్స్, చిట్టెక్క, ధనలక్ష్మి, ఏఐకేఎంఎస్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.